అమ్మే ఆరిజన్‌. తొలి కుటుంబం, తొలి చరిత్ర, తొలి ఇతిహాసం, తొలి వేదం, తొలి తొలిమతం, నాగరికత, సాంకేతికత అంతా అమ్మదేనని, ఆరోహణా సోపానాలపై అధిరోహణం చేయించి, సమున్నత శిఖరాల కొలువుతీరిన స్పిరిట్యువల్స్పిరిట్ని చూపించదలుచుకున్నాను ` అనే మహా సంకల్పాన్ని, మహోన్నతమైన ఆమె గతాన్ని విశదపరిచి, సప్రెషన్నుంచి ఆమెను బయటకీడ్చే మోటివేషన్లతో షూట్చేయాలనే సత్సంకల్పాన్ని సంకల్పించాననే చంద్రశేఖర్ప్రయత్నం అభినందనీయం.

                స్త్రీ అంతిమంగా తన గమ్యం చేరేందుకు ఆమె ఎక్కడ ఎలా ప్రారంభమైందో, సమాజంలో పాత్రని పోషించిందో, స్థానం నుంచి తను ఎందుకు ఎలిమినేట్చేయబడిరదో, పరాజితురాలుగా ఉన్న నేటి పరిస్థితికి ఎలా నెట్టబడిరదో దానికి గల సామాజిక, చారిత్రక, తాత్విక, సాహిత్య, ఆధ్యాత్మిక, ఆర్థిక కారణాలు వెరసి స్థితి నుంచి తను ఎలా ముందుకు పురోగమణం చెందుతుందో తెలుసుకునేందుకు ఖచ్చితంగా గ్రంథం ఒక ప్రేరణని ఇస్తుందని నమ్ముతున్నాను. ` కుర్రా శేషారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good