కదిలే కుర్చీలో, కదలని కండరాలతో కాలం కథ చెప్తూ, కాల బిలాలనూ (చీకటి బిలాలు), పిల్ల విశ్వాలనూ అన్వేషిస్తూ, మహా రూకల్పన కావిస్తూ, స్థల-కాలాలకు ఆరంభం, అంతం ఉండవని శాస్త్రీయ ప్రతిపాదన చేసి, అంతు బట్టని విశ్వం అంతు చూడాలని కడదాకా శోధన చేసిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్‌ హాకింగ్‌.

ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం, అద్భుతమైన విషయాలను ఎన్నింటినో చెప్తూ మనల్ని ముగ్థుల్ని చేస్తుంది. నేడు ఖగోళ శాస్త్రం దిగ్భ్రాంతి కొలిపే వేగంతో అనేక నూతన పరికరాలు, పద్ధతుల ద్వారా భారీ పరిమాణంలో సమాచారాన్ని సేకరిస్తోంది. నాలుగువందల ఏళ్ళనాడు గెలీలియో ప్రారంభించిన శాస్త్రీయ విప్లవాన్ని న్యూటన్‌ ముందుకు తీసుకెళ్ళాడు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం, స్థల-కాలాలు వంగి ఉంటాయని సమకాలీన సమాజం గుర్తించనప్పటికీ, ఐన్‌స్టీన్‌ పరిశోధన కొనసాగింపుగా స్థలం-కాలం, ద్రవ్యరాశీ శక్తి విశ్వరూపం, కృష్ణబిలాలు, విశ్వం భవిష్యత్తు వంటి అనేక అంశాలపై సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేరీతిలో గణిత సూత్రాలను అత్యల్పంగా వాడుతూ, సృజనాత్మక ఆలోచన ద్వారా కొత్తవి, మౌలికమైన భావాలను స్టీఫెన్‌ హాకింగ్‌ తన పరిశోధనల ద్వారా ప్రతిపాదించాడు.

ఈ పుస్తకంలో స్టీఫెన్‌ హాకింగ్‌ జీవిత విశేషాలను, పరిశోధనలను, సమకాలీన ఖగోళ శాస్త్ర విషయాలను శాస్త్రీయ దృక్పథంతో చక్కగా కూర్చారు రచయిత ఎస్‌.వెంకట్రావు.

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good