ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

సృష్టిలో తీయనిది

వర్షం... వర్షం... వర్షం...!

ఆకాశం చిల్లులు పడిందేమో అనిపిస్తోంది. కుండపోతగా కురుస్తోంది వర్షం. వర్షానికి తోడు నేనున్నానని ఈదురుగాలి ప్రారంభం అయింది. ఎముకల్ని కొరికేస్తుందా గాలితో చేరిన చలి.

కారులో ముడుచుకుని కూర్చున్న ముగ్గురు యువకులు లైటు వెలిగించి ఒకరినొకరు చూసుకున్నారు.

''మురళీ!...ఒరేయ్‌ మురళీకృష్ణా! ముందే చెబితే....''

''వర్షం వస్తుందని నేను కలగన్నానుట్రా మాధవ్‌?'' అన్నాడు. ఎంత నవ్వుతూ అనబోయినా మాటలలో కరుకుదనం ప్రతిధ్వనించింది......

Pages : 245

Write a review

Note: HTML is not translated!
Bad           Good