శ్రీరామకర్ణామృతము అనుపేరను ప్రసిద్ధమయిన యీ సంస్కృత గ్రంథము నెవ్వరెప్పుడు రచియించియున్నారో తెలిసికొనుటకు ఇందు ఆధారము లేదు. దీనిని నాలుగాశ్వాసములుగా విభజించి ప్రతిశ్లోకమునకు తెలుగున పద్యములు వ్రాసిన చేకూరి సిద్ధకవి ప్రతియాశ్వాసము చివర, ''శివసామ్యుండగు నాది శంకరులుమున్‌ శ్రీరామకర్ణామృతం, బవనిన్‌ సంస్కృత మేర్పరించె''నని వ్రాసియున్నాడు. ఆ చేకూరి సిద్ధకవిని గూర్చియు ఈ గ్రంథమున ఏ విషయమును తెలియరాకున్నది. ఇతడు పద్యములు వ్రాయు నాటికే యీ శ్రీరామకర్ణామృతము లోకములో వ్యాపకమయి యుండుటచే అప్పటికున్న మాతృకను అనుసరించి ప్రతిశ్లోకమునకు తనశక్తిని అనుసరించి ఆ కవి పద్యములు వ్రాసినట్లు కనపడుచున్నది. ఆ సిద్ధకవి ఇది ఆదిశంకరులు వ్రాసినట్లుగా వ్రాసియున్నాడేకాని అదులకు తగిన ఆధారములతనివి లభించినవో సూచించియుండలేదు. దీనిని ఆదిశంకరులు రచించియుండలేదన్న సంగతి గూర్చి అనేక నిదర్శనములీ గ్రంథములోనే దొరుకుచున్నవి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good