శ్రీరంగం శ్రీనివాసరావు తన కవితా ప్రస్థాన కథను చేస్తూ అతడు 1930కి పూర్వం వ్రాసిన పద్యాల గురించిగాని, 1950 తర్వాత రాస్తున్న రచనల గురించిగాని అక్కడ ప్రస్తావించలేదు. అంటే అతని ఉద్దేశంలో కూడా ఈ రెండు దశాబ్దాల మధ్య అతడు రచించిన కవితలే అతని విలక్షణత్వానికేకాక, మొత్తం అభ్యుదయోద్యమానికి ప్రాతినిథ్యం వహించే సాహిత్యమన్నమాట. ఈ రెండు దశాబ్దాలలో అతడు రాసిన వాటి గురించి విపులంగా విశ్లేషణ చేయడం సాహిత్య చరిత్రకారులకూ, సిద్ధాంత విమర్శకులకూ ఎంత అవసరమైనా 1930కి ముందు ఏయే కారణాలవల్ల శ్రీరంగం శ్రీనివాసరావు తన తరానికి ప్రాతినిథ్యం వహించే కవిగా రూపొందగలిగాడో (టూకీగానే కావచ్చు) తెలుసుకొనడం ముఖ్యం.
పేజీలు : 46