ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా; మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కిటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్ఛం ఈ సంపుటి.

సామాన్య ప్రజలకి కడుపునిండా గంజి, చేతినిండా పని, కళ్ళ నిండా నిద్ర, ఉండటానికి ఇల్లు సమకూరాలన్న సామాజిక స్పప్నంతో శ్రీపతి రచించిన కథలివి. మనిషినీ, మనిషిలోనీ ప్రేమించే మనిషితనాన్ని ప్రేమించే ఉదాత్త లక్షణం శ్రీపతి కథలకు జీవనాడి.

జీవిత వాస్తవాలను దర్శించిన కథలు ఇవి.

అలవోకగా పద చిత్రాలు గీసినట్లుగా ఉండే ఈ కథల్లో కవులను సైతం ఆశ్చర్యపరచే కాల్పనిక తీవ్రత కనపడుతుంది.

కథా సాహిత్య చరిత్రకు న్యాయం చేకూర్చే కథలే గాక పాఠ్యబోధనకు కూడా పనికివచ్చే పాఠ్యాంశాలు ఈ కథలు.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good