ఓ గుమస్తా కుమారుడు గణితశాస్త్రంలో ధృవతారగా రూపొందడం అంత సులువు కాదు. మనిషిలో ఏదో సాధించాలన్న తపన ఉండాలే కానీ సాధించలేనిది లేదు. పట్టుదల ముందు పేదరికం తలవంచాల్సిందే. లక్ష్యాన్ని ఛేదించే బాణంలాగా తన సమస్త చైతన్యాన్ని ఒక విషయంపై కేంద్రీకరించి, అనుకున్నది సాధించగలవాడే శాస్త్రజ్ఞుడు. ఏ గురువు దగ్గరా గణితంలోని మెళకువల్ని నేర్చుకోలేదు. అంకెలతో ఆడుకుంటూనే అద్భుత మేధావయ్యాడు. ఏ విశ్వవిద్యాలయం నుండీ ఆయనకు డిగ్రీ లేదు. రామానుజన్‌లోని ప్రతిభను గుర్తించిన హార్డీ ఇంగ్లాండుకు ఆహ్వానించాడు. అతి చిన్న వయస్సులోనే ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీకి ఎన్నికయ్యాడు. ప్రపంచం గుర్తుంచుకునే భారతీయుడుగా పేరొందాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ గణిత శాస్త్రవేత్త హార్డీ శ్రీనివాస రామానుజన్‌ను 'ఆయన ఓ సహజ గణిత శాస్త్రవేత్త. ఎంతో గొప్ప వ్యక్తి. మరో శాస్త్రవేత్తతో పోల్చలేని మనిషి' అన్నారు. అలాంటి మేధావిని భారతదేశం మరువలేదు. అరుదైన ఘనత పొందిన శ్రీనివాస రామానుజన్‌ జీవితచరిత్ర నేటి యువతరం తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

పేజీలు : 44

Write a review

Note: HTML is not translated!
Bad           Good