ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

శ్రీనిలయం

బడిగంట గణగణమంటూ మ్రోగింది. పిల్లలు బిలబిలమంటూ స్కూలు ఆవరణలోకి పరుగెత్తుతున్నారు. పెద్దపువ్వుల పరికిణీ కట్టుకున్న అమ్మాయి కూడా వారితోపాటు పరుగెత్తాలని తాపత్రయపడుతోంది. వెనకాలే వచ్చే ఓ పోకిరీ కుర్రవాడు ఆ అమ్మాయి జడపట్టి లాగాడు. తన చక్రాలవంటి కళ్ళను అటుకేసి తిప్పింది, ఇంకోడు సంచి లాగాడు. మళ్ళీ యిటు తిరిగింది. మరొకడు జడ లాగాడు. అమ్మాయి అయోమయంగా చూచింది. అందరూ కిలకిల నవ్వుతున్నారు. ఉక్రోషంగా వారివంక చూచింది.

''సానిదానికి కోపముందిరోయ్‌!'' అన్నాడో ఆకతాయి అబ్బాయి.

''కోపమేకాదు. టెక్కుకూడా వుంది'' యింకో చిలిపివాడు చప్పట్లు కొట్టాడు. ఆ వెనకాలే వస్తున్న ఆడపిల్లలు నవ్వారు. అందరూ చేసే గోల చూస్తూ వెనుకకు పోలేక, ముందుకు నడవలేక బిక్కమొహముతో నిల్చుందా అమ్మాయి.....

Pages : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good