Rs.60.00
In Stock
-
+
బంజారాహిల్స్‌లోని అధునాతనమయిన ఆ మూడంతస్తుల మేడ ముందు వచ్చి ఆగింది ఇంపాలా కారు.
కారు హారన్ విని మొత్తం మేడ చైతన్యం పొందినట్టు, ఎవరి పనులు వారు త్వరత్వరగా చేసుకుపోసాగారు. తెల్లటి యూనిఫారమ్‌లో ఉన్న డ్రైవర్ వచ్చి, కారు వెనక తలుపు తీసి పట్టుకున్నాడు. సీతాపతి కారులో నుంచి ఠీవిగా దిగాడు. నౌకరు రాములు పరుగెత్తుకు వచ్చి, ఆయన బ్రీఫ్‌కేసు, పై కోటు అందుకున్నాడు.
''నమస్తే సర్...'' గుమాస్తా శంకరయ్య వినయంగా చేతులు జోడించాడు.
తల పంకించాడు సీతాపతి.
అతను లోపలి హాల్లో అడుగుపెట్టగానే చిరునవ్వుతో స్వాగత మిచ్చింది అతని భార్య గోవిందమ్మ.
''బేబీ లేదా? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది'' చిరునవ్వుతో అడిగేడాయన. ప్రక్క గదిలోంచి వచ్చిందో అమ్మాయి.....
పేజీలు : 140