ఎక్కడెక్కడ శ్రీమద్రామాయణము చెపుతున్నపుడు నమస్కరిస్తూ, పరమ సత్యమనే ఆస్తిక్యబుద్ధితో వింటారో, అటువంటివారికీ శ్రీ మహావిష్ణువు కృపచేత తీరని కోరికలు ఉండవు. సంతానము లేనివారు రామాయణము వింటే చాలా గొప్ప పుత్రులు పుడతారు. తమ కుమారులు తమ కళ్ళముందు వృద్ధిలోకి వస్తూ ఉండగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులను చూసుకొని ఆనాడు కౌలస్య సముత్రి కైకేయి ఎటువంటి ఆనందమను పొందారో, తమ బిడ్డల వలన అటువంటి ఆనందమును తల్లులు పొందుతారు.
రామాయణం ఎక్కడ చెప్పబడిందో అక్కడికి సమస్త దేవతలు వచ్చి పరమ ఆనందమును పొందాతారు. అన్నిటిని మించి పితృదేవతలు సంతోషిస్తారు. ఈ రామాయణమును సమస్త ప్రజానీకము విని చెప్పుకొని తమ క్షేమమును, లోకక్షేమమును పొందాలి అని మహర్షి వాల్మీకి అభిలషించారు. రామాయణం చదివిన తరుఆత ఫలం పొందాలంటే మాత్రం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఏవమేతత్ పురావృత్త మాఖ్యానం భద్రమస్తు వ||
ప్రవ్యాహరత విస్రబ్ధం బాల విష్ణో: రపవర్థనామ్||
మనము ధర్మబద్ధంగా పరిపాలించి మన యోగక్షేమములను చూసే ప్రభువు సింహాసనంలో ఉంటే మనం ఏమి కోరుకుంటాము? మా ప్రభువుకి ఆయుర్ధాయం, బలం, తేజస్సు ఉండాలి. స్వరకాలముల యందు కూడా ఆయన మమ్ములను ఇలాగే కాపాడుతూ, పరిపాలిస్తూ మా యోగక్షేమములను చూడడానికి కావలసిన బలం నిలబడాలని మనం కోరుకోవాలి.
రాముడే శ్రీ మహావిష్ణువు అన్నారు దాశరధీ శతకంలో గోపరాజుగారు. శంఖ చక్రగథాపద్మములను చేతపట్టుకొని శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేసి రాముడుగా వచ్చినట్టు మనం బాలకాండలో చదివాము. మనకి రామాయణం చదివిన ఫలితం కలగాలంటే మా స్వామి, మ ప్రభువు, మా తల్లి , మాతండ్రి శ్రీ మహావిష్ణువు అంటూ - ఆ శ్రీ మహావిష్ణువుకు బలం కలగాలని ప్రార్ధించాలి. అప్పుడాయన సంతోషించి మన కోర్కెలన్నింటిని తీరుస్తాడు. లక్షలాది మందిని సమ్మోహితలను చేస్తున్న విశిష్టమైన శైలిగల బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి శ్రీ మద్రామాయణము ప్రవచనము (ప్రసంగాల)కు గ్రంధకూపమిది.
Rs.750.00
In Stock
-
+