శ్రీకాళహస్తీశ్వర శతకము రచించిన కవి ధూర్జటి. గొప్ప శివభక్తుడుగా శివారాధకుడుగా దర్శనమిచ్చే ఈ కవి మానవ జీవితంలోని వెలుగుచీకటులు హెచ్చుతగ్గుల పట్లకూడా తన మనోవేదన వ్యక్తం చేస్తాడు.

కాలమహాస్రవంతికి ఎదురీదే తత్త్వంగల భావోద్రేకిగా రాజులను వ్యతిరేకించి వారి చర్యలను ఖండిస్తాడు. మానవుడు ఐహిక భోగభాగ్యాలను త్యజించాలనీ, వైరాగ్య కాంక్షతో జీవన్ముక్తుడు కావాలనీ ప్రబోధిస్తాడు. స్వతంత్రుడుగా స్వానుభవం ప్రకటిస్తాడు. ఈ శతకం ఆనాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. ధారాళమైన శైలితో సాగే ఈ శతకపద్యాలు ఆంధ్రశతక వాజ్మయంలో అనర్ఘరత్నాలు. గొప్ప శతకకవుల పద్యాల క్రింద సరళమైన భావాన్ని పొందుపరచి సామాన్య పాఠకులకు, యువతరానికి, ముఖ్యంగా విద్యార్థులకు అందించాలన్నది మా ఆకాంక్ష.

పేజీలు : 44

Write a review

Note: HTML is not translated!
Bad           Good