భారతదేశంలో ఆధునిక రాజకీయాలైన-స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం అన్న భావవ్యాప్తితో రాజకీయపార్టీలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెసు, సోషలిస్టు, కమ్యూనిస్టు, ముస్లింలీగు పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అనేక ప్రజా ఉద్యమవేదికలేర్పడ్డాయి. కాంగ్రెసు పార్టీ కన్నా కమ్యూనిస్టు పార్టీ 40 సంవత్సరాల వెనుక 1921-25లలో ఏర్పడింది. అది నాటి మద్రాసు ప్రెసిడెన్సీ, నైజాముల్లోకి 1931-32 ప్రాంతంలో కార్యక్రమాలు ప్రారంభించింది. బ్రిటీషు సామ్రాజ్యవాదానికీ, ఇనాందారీ, జమీందారీ విధానాలకీ వ్యతిరేకంగా రాజకీయశక్తులను మలుచుకోసాగింది. విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, రైతాంగం తదితర ప్రజాశ్రేణులలో తన కృషి ప్రారంభించింది. అనతికాలంలోనే అది ప్రజాభిమానాన్ని చూరగొంది. అనేక మంది విద్యావంతులైన నాటి యువకులు ఈ కర్తవ్య నిర్వహణను చేపట్టారు. మొత్లంలో భాగంగానే ఉత్తరాంధ్రలో గూడా తొలినాళ్ళ నుండే ఈ కార్యక్రమం చేపట్టారు. 1960 దశాబ్దంలోని శ్రీకాకుళ ఉద్యమానికిది పూర్వరంగం. రచయిత ఈ పూర్వరంగాన్ని సరిగ్గానే స్పృశించారు

ఈ గ్రంథానికి శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమం అని నామకరణం చేసినప్పటికీ, ఫ్యూడల్‌ పెత్తనం, దోపిడీ; జమిందారీ, ఈనాందారీ విధానాలు; అవి రైతాంగానికి కలిగించిన  కష్టాల నేపథ్యం అర్తం కావాలంటే నేటి ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల, ఒరిస్సాలోని కోరాపుట్‌, గంజాం జిల్లాల చారిత్రక నేపథ్యంలోకి రచయిత వెళ్లవలసి వచ్చింది. ఈ ఆపంతాలలో దోపిడీ, పీడన, అణచివేతలు ఎలా వున్నాయో, వాటి నెదుర్కొంటూ ప్రజా తిరుగుబాట్లెలా జరిగాయో రచయిత పరిశీలించారు.

పేజీలు : 422

Write a review

Note: HTML is not translated!
Bad           Good