శ్రీ మహావిష్ణుపురాణం పరాశర మహర్షి ప్రణీతము. సుమారుగా 6,412 శ్లోకములతో అలరారుతోందీ పురాణం. వ్యాసవిరచితమని చెప్పడానికి కారణం... ఇది వ్యాస జనకుడైన శ్రీ పరాశరుల వారిచేత, మైత్రేయ మహామునికి మొదట వివరించబడగా, మైత్రేయునివల్ల విని, వ్యాసుడు దీన్ని విష్ణుపురాణంగా గ్రంథస్ధం చేశాడు - అని ప్రతీతి.

పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఉద్భవ-ప్రాభవాలు, అవతార అంశాలు, విష్ణుభక్తి స్వరూప వైశిష్ట్యం, స్తోత్రాలు, ఉపాఖ్యానాలు..... వంటి అంశాలెన్నో ఈ పురాణంలో స్పష్టంగా ప్రతిపాదింపబడినాయి. మొత్తం ఆరు అంశాలుగా విస్తరించిన శ్రీవిష్ణుపురాణంలో, పురాణ లక్షణాలుగా చెప్పబడే సర్గ - వంశ - మన్వంతర - వంశానుచరితం అనేక లక్షణాలు వివరంగా ఉన్నాయి.

ఇంకా ఏమేమి ఉన్నాయి ?

భౌగోళిక సంబంధ (రాజ్య, దేశ భూభాగాది...) విషయాలు, జ్యోతిర్గోళాది విశేషాలు, సంస్ధాన, తీర్ధక్షేత్ర నదీనద వర్ణనలు, వర్ణాశ్రమ ధర్మాలు, ప్రాచీన రాజ వంశాల నిరూపణ, భక్తి తత్పరుల నిమిత్తం ............. అక్కడక్కడ మహిమాన్వితమైన స్తోత్రాలు, ఆధ్యాత్మిక ధర్మాన్ని తెలియజెప్పే సంవాద రూప విశేషాలు, అవతార విభూతులు... ఒక్క మాటలో చెప్పాలంటే - శ్రీమహా విష్ణుభగవానుని విరాడ్రూపం సందర్శింపజేయగల ఏకైక పురాణం - ఈ శ్రీమహావిష్ణుపురాణం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good