వీరబ్రహ్మేంద్రుడుని పుట్టుక నిర్ణయం

ఆత్మపట్టణము పదునాలుగు లోకములకు, జహల్లోకమునకు పైన వున్నది. ఆ ఆత్మ పట్టణమున తపస్సు చేస్తున్నాడు వీరప్పయ్యస్వామి.

విశ్వకర్మ, దేవతలు వీరప్పయ్య స్వామిని 'అనాది విరాట్‌ స్వరూపా! అచలపరిపూర్ణాతీతా! అనంతరూపా! భువనైకనేతా! దేవాధిదేవా! మీ తపమును చాలించి మా ప్రార్థన నాలించి, మమ్ము అనుగ్రహించండి స్వామీ' అంటూ ప్రార్థించారు.

వీరప్పయ్యస్వామి తపసుస నుండి లేచి దేవతలను ఆశీర్వదించి 'నాయనలారా! మీరు వచ్చిన పనియేమని' అడిగారు. దేవతలు 'దేవాధిదేవా! భూలోకమున పాపము నానాటికి పెరిగిపోతున్నది. సజ్జనులు సంచరింప శక్యము గాకున్నది. గత మూడు యుగములందున ఏ కొందరో రాక్షాసాధములు, దుర్మార్గులు ఉండేవారు. కాని ఇప్పుడు ఈ కలియుగమున అత్యధికులు రాక్షసప్రవృత్తి కలిగిన వారైనందున, మేము మీ వద్దకు వచ్చియున్నాము. కనుక ఇప్పుడు తమరే భూలోకమున అవతరింపమని మా ప్రార్థన' అని వేడుకొన్నారు.

వీరప్పయ్యస్వామి వారి కోర్కెను మన్నించి 'దేవతలారా! మీ అభీష్టం మేరకు మేము భూలోకమున అవతరించెదము. మీరున్నూ మీమీ అంశలతో అవతరించండి.

''మేము శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రులమై విరాజిల్లెదము. ఓయీ! శంకారా! నీవు ఆనందభైరవయోగిగా రావలసినది. ఓయీ బ్రహ్మా! నీవు అన్నాజయ్యగా సంచరించుము! ఓయీ! అఖండ పరశివా! నీవు సిద్ధమూర్తివై నన్ను సేవించుము'' అని చెప్పారు. దేవతలు స్వామియే స్వయంగా అవతరిస్తున్నందుకు సంతోషాంతరంగులై, వీరప్పయ్యస్వామికి నమస్కరించి వారివారి స్థానములకు వెళ్ళిరి. వీరప్పయ్యస్వామి మరలా తపస్సుకు సిద్ధమయ్యారు.

Pages : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good