హాస్యపు సంభాషణములు
హాస్య : ఓ¬! ఎవరయా మీరు? జడలూ, రుద్రాక్షలూ ధరించి జగన్మోహనంగా విచ్చేసినారు.
యోగి : ఆహాహా! మేము శ్రీ బిరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి సన్నిధియందుండే సేవాధికులము.
హాస్య : అయితే మీ నామథేయ మేమయా స్వామీ?
యోగి : మా నామథేయం ఏకాంబరయోగి అంటారు.
హాస్య : అయితే గియితే యేమి కార్యమున యచటికి విచ్చేసినారయ్య స్వామి?
యోగి : మాయొక్క ప్రభువుగారైన శ్రీశ్రీ స్వాములవారు వస్తూ వున్నారు గనుక యీ సభాసదులకు తెలియపరచ వచ్చినారము.
హాస్య : ఓ¬¬! అలాగునా? అయినప్పటికిన్నీ వున్నది వున్నట్లుగాను లేనిది లేనట్లుగానూ క్రమం తప్పకుండా చెప్పుకురాపయ్య స్వామీ.
యోగి : ఆహాహా! అట్లాగే వినండయ్య అందరు మహాజనులు.
ద్విపద - ముఖారిరాగము
ద్వి : భువిలోన పేర్గల పురమనంబరగి నవ మ¬న్నతమైన నందికొండయను - క్షేత్రంబు పాపఘ్ని సిద్ధిప్రదంబు - స్తోత్రపాతంబట్టి శుద్ధస్ధలమున - యాజకుండ గుమ వీరాంకుడై యొప్పు - భోజయాచార్యుండు పుణ్యవ్రతుండు - విశ్వ కర్మాన్వయ విఖ్యాతమూర్తి యైశ్వర్యవంతుడై, యతి తపధ్యాన - సంపత్క్రియాధుర్య, చాతుర్యుడగు - పెంపొంది సుజ్ఞానపృధివిచే మించి - అప్పయ డేరు వీరప్పయగాంచె - చెప్పిచూపగగాని, చిత్కళామూర్తి -చెన్నొంది మహిత ప్రసిద్ధుడొయనగ.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good