శ్రీ వరాహ నరసింహస్వామి అవతారము

భాగవతము, పురాణేతిహాసముల ప్రకారము అవతగారాల సంఖ్య అనేక విధాలు. ముఖ్యముగా చెప్పుకొనేవి, ప్రస్తావించబడేవి దశావతారాలు మాత్రమే. అవతారాల సంఖ్య ఎన్నైనా అన్నింటిలోనూ, ఈ వరాహ, నారసింహ అవతారాలు తప్పకుండా పేర్కొనబడ్డాయి. దశావతారాల్లో వరాహావతారాము మూడవదికాగా, నాలుగవది నృసింహావతారము. అన్నదమ్ములైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను సంహరించడానికి శ్రీమహావిష్ణువు ఎత్తినవి ఈ రెండు అవతారములు. ఈ రెండింటి మిశ్రమరూపమే శ్రీవరాహ నరసింహావతారము.

దశావతారములలో చేరని ఈ వరాహనరసింహావతారము, తన భక్తుడైన ప్రహ్లాదుని కొఱకు శ్రీమహావిష్ణువు ధరించినది. నరసింహావతారము ప్రహ్లాదుని కోరిక ప్రకారము వచ్చిన అవతారమని చెబుతారు. లోతుగా ఆలోచిస్తే అది సరికాదు. నరసింహావతారము ప్రహ్లాదుని కోరిక ప్రకారము వచ్చిన అవతారము కాక, అది హిరణ్యకశిపుని కోరికల వల్ల వచ్చిన అవతారము అనిపిస్తుంది. ప్రహ్లాదుడు కోరుకొనగా శ్రీమహావిష్ణువు ధరించిన అవతారము శ్రీవరాహనరసింమావతారము.

పేజీలు : 52

Write a review

Note: HTML is not translated!
Bad           Good