ఈ భూమివిూద మొట్టమొదటి కావ్యం ''శ్రీరామాయణం''. వాల్మీకి భగవానుడు చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం పొంది తన దివ్య దృష్టిచే సకలము చూచి, విని లోకానికి అనుగ్రహించిన అద్భుత ఆదికావ్యం శ్రీరామాయణం.

ఇది మానవునికి అన్ని కోణాలలోనూ, అన్ని రకాలవారికి తన అద్భుత సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది కథలు ఇష్టపడతారు. వారికి అన్ని రసాలు కలిగిన కథగా ఇది చూపబడుతుంది. కొంతమంది ధర్మాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. వారికి కావలసిన సామాన్య ధర్మాలు అంటే సత్యవాక్యపరిపాలన, పితృభక్తి, ఏకపత్నీవ్రతం, పెద్దలయెడల గౌరవభావం. ఇలా వర్ణాశ్రమ సంబంధమైన ధర్మాలన్నీ చూపిస్తుంది. అంతేకాక ముక్తికి కావలసిన వేదాన్తార్ధాన్ని అద్భుతంగా బోధపరుస్తుంది. ఈ మహత్తర కావ్యానికి ''దీర్ఘశరణాగతి'' అని పేరు పెట్టారు మన పెద్దలు. కావ్యలక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఈ రామాయణం ''ధ్వన్యర్ధ ప్రధానమైన'' కావ్యంగా ప్రసిద్ధి పొందినది.

ఈ కావ్యం అనేక సుభాషితాలను కూడా అందించింది. వాటినన్నిటిని లోకానికి వాల్మీకి సుభాషితాలుగా గ్రంథ రచయిత కృష్ణమాచార్యులు మనకు అందించారు.

Pages : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good