''శ్రీ వాల్మీకి రామాయణం' వచనంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ గురించి తెలియజేశారు రచయిత.

బాలకాండ : వాల్మీకి - నారద సంవాదము : అది పవిత్రమైన జలాలతో ప్రవహించే తమసా నదీతీరం. అక్కడ మహాతపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నివశిస్తున్నాడు. అలా ఉన్న వాల్మీకి మహర్షి దగ్గరికి ఒకరోజు బ్రహ్మర్షి, వేదాధ్యయనపరుడు, వాక్చాతుర్యం కలవాడు అయిన నారదమహర్షి వచ్చాడు. ఆయనకు స్వాగతసత్కారాలను చేసి ఉన్నతమైన ఆసనంలో కూర్చోబెట్టి, వాల్మీకి మహర్షి ఆ నారదుని ఈ విధంగా అడిగాడు.

'ఓ మహర్షీ! గుణవంతుడు, వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యమునే పలికేవాడు, స్థిరచిత్తం కలవాడు, సదాచార సంపన్నుడు, సర్వభూతములకు హితమును చేయువాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, జాతక్రోధుడు (అరిషడ్వర్గమను జయించినవాడు) ద్యుతిమంతుడు, అసూయలేనివాడు, రోషం కలిగితే దేవతలను సైతం భయకంపితులను చేసే మహాపురుషుడు ఎవరు? అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని గురించి వినాలని ఆరాటపడుతున్నానని' వినయంగా అన్నాడు.

Pages : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good