కుమారసంభవ రచన జరిగినప్పటి కాలం నుండి ఇప్పటికీ పెద్దల షణ్ముఖోత్పత్తి పారాయణ చేస్తారు. ఈ వృత్తాంతం వినడమెంత గొప్పదంటే, జన్మజన్మాంతరపాపాలను అనుభవించడానికి జన్మించే శిశువు, తల్లి గర్భం లోపల పిండంగా ఉన్నప్పుడు కూడా సంస్కరించే శక్తి కలిగిన ఏకైక అభ్యాసం. సుబ్రహ్మణ్వేశ్వరస్వామి ఉత్పత్తి ఒక్కటే అటువంటిదని పెద్దలు చెప్పారు. అందుకే ఇప్పటికీ గర్భిణులు సుగ్రహ్మణ్యోత్పత్తిని - రెండు - మూడు సర్గలలో ఉన్న ఆ విషయాన్ని - పారాయణ చేస్తారు. ఇప్పటికీ సుబ్రహ్మణేశ్వరస్వామి వైభవానికి లోకంలో ఎంత ప్రాధాన్యం ఉన్నదంటే వ్యాధులను నయం చెయ్యడం దగ్గరి నుంచి సంచితంగా వస్తున్న పాపాల రాశాని దగ్ధం చేసేవరకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వైభవం వినడం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్తోత్రాన్ని చదవడం విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Pages : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good