శ్రీ వడ్డాది సత్యనారాయణమూర్తి జన్మస్థలం విజయనగరం. పుట్టుక, పెరగడం, విద్యాభ్యాసం అన్నీ అక్కడే. 34 సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖలో పని చేసి ప్రస్తుతం గుంటూరు జిల్లా అమరావతిలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. రచనాపరంగా లోగడ కొన్ని నవలలూ, నవలికలూ, కథలూ రాసినా పేరు తెచ్చినది - 'ధ్యానసాగరం'.
'శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం' చదివిన తరువాత అందులో ఆత్మ, తాత్విక, అద్వైత తత్త్వములకు సంబంధించిన కొన్ని ఘట్టములను అధ్యాయమునకొకటి చొప్పున నాకు గల విషయ పరిజ్ఞానమునకు అనుగుణంగా ఎంచుకుని వాటిని విశ్లేషించి, ఈ ''శ్రీ శ్రీపాద గీతామృతం'' గ్రంథములో పొందుపరిచినాను. అంతేకాదు - ఘటనా ఘటన సమర్ధులైన శ్రీపాద వల్లభుల కొన్ని అద్భుత లీలలను, వారు ఉద్భోదించిన కొన్ని ధార్మిక, సామాజిక, న్యాయసూత్రాలను కూడా విశ్లేషించి వివరించి ఇందులో పొందుపరిచినాము. - వడ్డాది సత్యనారాయణమూర్తి
Rs.75.00
In Stock
-
+