ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్తూ...

    ఆ ప్రయత్నంలో వెలువడిందే ఈ ''శ్రీశ్రీ-100'' విశేష సంచిక. ఇది మహాకవి శ్రీశ్రీ శతజయంతి ప్రత్యేకం. 1/4 డెమ్మీ సైజులో మల్టీ కలర్‌ అపురూప బాపు ముఖ చిత్రంతో, 152 పేజీలతో వెలువడిన ఈ సంచికకు మరో నూరుగురు సమర సాహితీవేత్తలు తమ కొత్త రచనలు అందించారు.

    ఇంకా ఈ సంచిక వారి వారి చిత్రాలతో ప్రముఖ అమర సాహితీవేత్తలు శ్రీశ్రీపై వెలిబుచ్చిన అభిప్రాయాలూ, ప్రముఖ చిత్రకారుల శ్రీశ్రీ రేఖా చిత్రాలూ, ప్రతి రచన ముందు నినదిస్తూ మహాకవి శ్రీశ్రీ ఒక కొటేషనూ పొందుపరుచుకుంది. ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ పరంపరలో 21వది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good