తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు ఈ శతాబ్దం నాది అన్నాడు (1972) శ్రీశ్రీ. నిజానికి ఈ శతాబ్దం-21 కూడా శ్రీశ్రీదే ఎందుకంటే - 

    ''ఇది ప్రపంచ కుగ్రామం

    ఇది గ్లోబల్‌ సంగ్రామం''

అని అంతకుమందే ('తుది పయనం : తొలి విజయం' - 1971) అన్నాడు. ఈనాటి ఋషిత్రయం మార్క్సు, లెనిన్‌, మావో అని కూడా తెగేసి చెప్పాడెప్పుడో. శ్రీశ్రీ మాటలకు కాలదోషం పట్టదు - ఒక్కనాటికి కూడా.

    మానవుడిని మానవుడు పీడించడం మానేసినప్పుడు మాత్రమే ఎర్రజెండా తెల్లజెండా అవుతుంది. అందాక ఈ జైత్రయాత్ర సాగాల్సిందే.

    సామాజిక విప్లవానికి శ్రీశ్రీ కవిత్వం చూపుడు వేలు. ఈ తరానికి కూడా అది ఉద్రేకం, ఉత్తేజం, ఉత్సాహం నిండుగా అందిస్తుంది. శ్రీశ్రీ కవితలు మనకి కరదీపికలు. అవి వెలుగు బావుటాలు. ఆ జ్వాలలు నిరంతరం మండుతూ, మండిస్తూ ఉంటాయి. నవసమాజ నిర్మాణానికి అవే మార్గదర్శకాలు.

    శ్రీశ్రీని భావితరాలకు చెక్కు చెదరకుండా అందజేయడం కోసం ''శ్రీశ్రీ సాహిత్యనిధి'' ఏర్పాటయింది. శ్రీశ్రీ రాసిందీ, చెప్పిందీ, శ్రీశ్రీ మీద రాసిందీ, చెప్పిందీ పొల్లు పోకుండా నిక్షిప్తం చెయ్యడమే ఈ నిధి ధ్యేయం.

    నేను సైతం ప్రపంచాగ్నికి

    సమిధనొక్కటి ఆహుతిచ్చాను

అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుని మీ వంతు కృషి చేయమని విన్నపం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good