'మహా ప్రస్థానం' మొదలుకొని 'మరో ప్రస్థానం' గీతాల వరకు శ్రీశ్రీ మార్గంలో కొసకంటా వెళ్ళగలిగినవాడు శ్రీశ్రీయే. 'అనితరసాధ్యం' తన మార్గం అన్నప్పటికీ తన కవిత్వంలో 'పునర్‌ యవ్వనాన్ని' జీవించాల్సి వచ్చినప్పుడు తన మార్గంపై యువకుల ప్రభావాన్ని నిర్ణాయకత్వాన్ని ఆమోదించి వారివెంట నడిచి శ్రీశ్రీ వారివెంట పయనించాడని 'మరో ప్రస్థానం' గీతాలు చూస్తే అర్థం అవుతుంది. తానూ, తనశైలీ, తన శబ్దశక్తి కన్నా తన మార్గం విస్తృతమైందని శ్రీశ్రీ గుర్తించాడు. ఆ మార్గంకోసం ఆ మూడింటిని ''అప్‌టుడేట్‌'' చేశాడు. ఇందులో నిజానికి గొప్ప త్యాగం ఇమిడివుంది. ముఖ్యంగా ఎంతగింజుకున్నా తమ డిక్షన్‌ను పదబంధాల వ్యసనాన్ని వదులుకోని అనేకమంది కవులను, 'మహాప్రస్థానం' గీతాలు ఆవహించిన వాళ్ళను చూస్తే ఇది మరీ చక్కగా అర్థం చేసుకోవచ్చు.

    ''మరో ప్రస్థానం'' గీతాలు శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే ఈ శతాబ్దపు దందహ్య మానకల్లోల దశాబ్దమైన ఏడో దశకంలో వెలువడినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good