శ్రీశ్రీ కవితలకు వ్యాఖ్యానం అవసరమా? - అని ఎవరైనా అనవచ్చు. శ్రీశ్రీ కవితల్లో - అది మహాప్రస్థానమైనా, ఖడ్గసృష్టి అయినా, మహాసంకల్పం అయినా, ఆ తరువాతి రచనలైనా - వాటిలో వాస్తవికత ఉంది. 'శోధించి సాధించా'లన్న సందేశం ఉంది. అమాయకత్వంతో, నిరక్షరాస్యతతో, అనేకానేక మూఢ విశ్వాసాలతో బాధపడుతున్న దోపిడీ స్వరూపస్వభావాలను అర్థం చేసుకోలేని జనాన్ని చైతన్య వంతం చేసే లక్ష్యంతోనే, 'ఒక జాతిని వేరొక జాతీ, ఒక మనిసిని వేరొక మనిషీ- పీడించే సాంఘిక ధర్మం ఇంకా' చెల్లని సమసమాజాన్ని స్ధాపించుకొనే స్ధాపించుకునే మహత్తర ఆశయాన్ని సాకారం చేయడానికే శ్రీశ్రీ తన కవితలు, వ్యాసాలు రాశారు. ఇతర రచనలు కూడా చేశారు. అయితే ఎంత సత్యమైనా, వాస్తవమైనా పదేపదే చెప్పకపోతే చెవికెక్కని పరిస్ధితి ఉంది గనక, మన మాటలు వినపడకుండా చేసే పెద్ద గొంతులు, మైకులు మన చుట్టూ ఉన్నాయి గనక, మనం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిందే. అందుకే 'ఖడ్గసృష్టి' ఎంత అవసరమో, దాని 'పరామర్శ' కూడా అంతే అవసరం. ఆ పనినే సి.వి. అపూర్వమైన పద్ధతిలో చేశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good