సామ్యవాదమే నా గమ్యం కవిత్వంలోనూ జీవితంలోనూ అన్న శ్రీశ్రీ కవిత్వం భువన భువనపు బావుటాగా ఎగురుతూనే వుంది. శ్రీశ్రీ జీవితాన్ని సాహిత్యాన్ని, రాజకీయాలను సమగ్రంగా, వాస్తవికంగా పరిశీలించిన పుస్తకం ఇది. ఆయన స్వీయరచనలు, సమకాలికుల జ్ఞాపకాలు, రాజకీయ చరిత్రక పరిణామాలు, ఉద్యమాల, సంఘాల పూర్వపరాలు ఒకే చోట చూపించే విస్తృత ప్రయత్నం. శ్రీశ్రీ అశేషాభిమానులకు, అభ్యుదయ గాముకులకు ఆసక్తి గొల్పే రచన. |