శ్రీశ్రీ బులెటిన్‌కి కితాబు అవసరం లేదు.  పాఠకుల ఉత్తరాలు, అభిమానుల ప్రశంసలు, సీనియర్‌ రచయితల సలహాలు, సీరియస్‌ రచయితల సూచనలూ, ఉద్యమ సాహిత్యసంస్థల ప్రోత్సాహాలు ఎన్నో ఎన్నెన్నో, అవన్నీ ఎప్పటికప్పుడు 'శ్రీశ్రీ! ఓ శ్రీశ్రీ!' శీర్షికలో సంస్పదనలుగా ప్రతి బులెటిన్‌ వెనుక చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  ఇప్పుడూ యథాతథంగా చోటుచేసుకునే ఉన్నాయి.  అవే శ్రీశ్రీ బులెటిన్‌కి తిరుగులేని కితాబులు....

మరో ప్రపంచం మహాకవి విషయాలూ, విశేషాలతో వినూత్న శీర్షికల సమాహారం శ్రీశ్రీ బులెటిన్‌.  ఇది త్రైమాస బులెటిన్‌.  ఇది అమూల్యం.  

''కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కాదేది కవితకనర్హం''అంటూ కవిత్వ చైతన్య పరిధిని దూర భూరేఖ వరకు విస్తరింపజేసిన కవి శ్రీశ్రీ. 

కవిత్వంలోను, వచనంలోను వాస్తవికతను, అధివాస్తకవితను మేళవించి - కవిత, కథ, నాటిక, వ్యాసం - ఏది వ్రాసినా అనర్గళం, అసాధారణం తన మార్గం అనిపించుకున్న కవి శ్రీశ్రీ.

కర్షకుల, కార్మికుల ఘర్మజలానికి మొదటిసారిగా ఖరీదు కట్టిన షరాబు శ్రీశ్రీ.

కదిలేదీ, కదిలించేదీ-మారేదీ, మార్పించేదీ-మునుముందుకు సాగించేదీ నవకవనానికి కావాలని ఎలుగెత్తి ఘోషించిన కవి శ్రీశ్రీ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good