శ్రీశ్రీ బులెటిన్‌కి కితాబు అవసరం లేదు.  పాఠకుల ఉత్తరాలు, అభిమానుల ప్రశంసలు, సీనియర్‌ రచయితల సలహాలు, సీరియస్‌ రచయితల సూచనలూ, ఉద్యమ సాహిత్యసంస్థల ప్రోత్సాహాలు ఎన్నో ఎన్నెన్నో, అవన్నీ ఎప్పటికప్పుడు 'శ్రీశ్రీ! ఓ శ్రీశ్రీ!' శీర్షికలో సంస్పదనలుగా ప్రతి బులెటిన్‌ వెనుక చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  ఇప్పుడూ యథాతథంగా చోటుచేసుకునే ఉన్నాయి.  అవే శ్రీశ్రీ బులెటిన్‌కి తిరుగులేని కితాబులు....

మరో ప్రపంచం మహాకవి విషయాలూ, విశేషాలతో వినూత్న శీర్షికల సమాహారం శ్రీశ్రీ బులెటిన్‌.  ఇది త్రైమాస బులెటిన్‌.  ఇది అమూల్యం.

నవయుగ కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావుగారు.  ఛందోబందోబస్తుల్ని ఛేదించే ముందు వాటిపై, మాటపై, తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ ఇదీ తెలుసు నాకు-ఇదే మంచి మీకు-అని సాధికారికంగా ప్రకటించి జెండా ఎగరేసిన విప్లవకవి శ్రీశ్రీ. రేపటిరోజుకు ఊపిరి శ్రీశ్రీ. - బాపు

Write a review

Note: HTML is not translated!
Bad           Good