''ఇదుగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే''
సముద్రం మీద జాబిల్లి ప్రతిఫలించడం సర్వసాధారణం. గాలి సముద్రపుటలల్ని వెనక్కీ ముందుకీ తోయడమూ మామూలే. ఇలా అలలు అటూ ఇటూ కదిలినప్పుడల్లా సముద్రం మీద వెన్నెల తొణికిసలాడుతుంది. సముద్రం మీద చంద్రుని సంతకం చెదిరిపోతుంది. మరి ఏదో ఒక కాలాన ఈ కడలి తరగలాగిపోయి సముద్రం మీద చంద్రుని సంతకం చెరిగిపోకుండా ఉంటుందా? మనిషి కడలి తరగలనాపలేక పోవచ్చుకాని, శ్రీశ్రీ ఆకాంక్ష ఏమంటే ఏదో ఒకనాటికి ప్రకృతి శక్తుల్ని పూర్తిగా శాసించే స్థితికి మానవుడు ఎదుగుతాడని. ఇదే ఆకాంక్ష ఆ తర్వాత
''సూర్యుని అరచేతపట్టి
రైతు దుక్కిదున్నును
ఫ్యాక్టరీలో చందమామ
మరచక్రం తిప్పును'
అన్నప్పుడు శివసాగర్‌లో కూడా కనిపించింది.
పేజీలు : 31