గోగులపాటి కూర్మనాథకవి క్రీ.శ. 18వ శతాబ్దానికి చెందినవాడు. క్రీ.శ. 1720 ప్రాంతంలో నేటి విశాఖజిల్లా 'రామతీర్థం' అనే గ్రామంలో పుట్టి, క్రీ.శ. 1790లో అదే జిల్లాఓలని ''దేవులపల్లి'' అనే గ్రామంలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ కవి విజయనగర సంస్తానాధీశుడు పూసపాటి పెదవిజయరామరాజు గారిచే సత్కరింపబడ్డాడు. 'ఈ పెదవిజయరామరాజుగారు క్రీ.శ. 1757లో జరిగిన ''బొబ్బిలి యుద్ధం''లో మరణించాడు.) విజయనగరం సమీపంలో ఉన్న ''రామతీర్థం'' ఈ కవి స్వగ్రామం. తల్లిదండ్రులు : 'గౌరుమాంబ-బుచ్చనమంత్రి'8. పితామహుడు : ''సూరనార్యుడు''. గురువు, విజయనగరరాజుల రాజగురువైన ''శ్రీ తిరుమల పెద్దింఇ సంపత్కుమార వేంకటాచార్యులవారు''. ఈ కవికి ''వెంకన్న, కామన్న'' అనే ఇద్దరు తమ్ములున్నట్లును, వారు కాశీ రామేశ్వర మజిలీలు చేస్తూ, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ, దేశసంచారం చేసినట్లును తెలుస్తోంది. కూర్మనాథకవి స్వగ్రామానికి దగ్గరలో ఉన్న దేవాలయాలలో సంకీర్తనాచార్యుడుగా ఉండేవాడు. ఈ పదవిలో ఇతనిని పెదవిజయరామరాజుగారో లేక ఆయన తండ్రి మొదటి ఆనంద గజపతి రాజుగారో నియమించారు. ఆ రాజుల దేవాలయాన్నింటినీ ఈ కవి దర్శించి, సాహిత్య కైంకర్యం చేస్తూ ఉండేవాడు...

పేజీలు : 151

Write a review

Note: HTML is not translated!
Bad           Good