ప్రతి సిద్ధపురుషుడిదీ ఒక విశిష్టమైన చరిత్ర. వారి అంతరాలు ఒకటేకాని అవలంభించే పద్ధతులు వేరు. ఎవరు ఏ గురుమూర్తిని విశ్వసించినా ఆ గురువు మీద గురి ఉండాలి. విశ్వసించేవాడు విలువలు తెలుసుకొంటాడు. సంశయించేవాడు వెనుకబడే ఉంటాడు. ఇందులో ఎవరి ప్రాప్తం వారిది. సాధన ముఖ్యం.

శ్రీ రాఘవేంద్రస్వామి కేవలం లౌకికమైన కోరికలను మాత్రమే తీర్చే కల్పతరువు కాదు. ముక్తిపథాన్ని కూడా చూపగలిగే కామధేనువు. ఆ స్వామి సజీవంగా బృందావనస్థుడై శతాబ్దాలు గడిచినా మహిమలు మాత్రం పరంపరగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఆ స్వామి చరిత్రను సమగ్రంగా పాఠకులకు అందించాలనే లక్ష్యంతో ప్రముఖ రచయిత డాక్టర్‌ గుమ్మనూరు రమేష్‌బాబు 'శ్రీ రాఘవేంద్రస్వామి దివ్యచరిత్ర' పుస్తకాన్ని అందించారు.

Pages : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good