సృష్టిలో మానవజన్మ అత్యుత్తమమైనది. పశుపక్ష్యాదులకంటే మానవునకు విశిష్టత నొనగూర్చునది అతని బుద్ధియే. ఈ బుద్ధిని సరిగా వినియోగించి జ్ఞానము నార్జించుటే మానవుని ముఖ్యకర్తవ్యము. మానవుడు జడమును, నాశవంతమును అగు శరీరముగాక అందుండు తెలివి యొక్క అంశమగుటచే ఈ జీవలోకమందు జీవుడైనాడు'' అని శ్రీకృష్ణుని గీతావాక్యము. శ్రీమద్భగవద్గీత సాక్షాత్తుగా భగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది. అపరిమితమైనది. ఆ మహిమను సంపూర్ణముగ ఎవ్వరును వర్ణింపజాలరు. ప్రతివ్యక్తియు గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన ధారణాదుల ద్వారా సేవింపవలెను. శ్రీమద్భగవద్గీత గంగ కంటె పవిత్రమైనది మరియు గాయత్రీ మంత్రము కంటే మిక్కిలి శ్రేష్ఠమైనది. నిత్యపారాయణ గ్రంథము. గీతాభ్యాసమొనర్చినవాడు తాను తరించుటయేగాక ఇతరులను సైతము తరింపజేయగలడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good