శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి పేరు ఆంధ్ర, ఆంధ్రేతరులైన ఆబాలగోపాలానికి సుపరిచితం. మానవాళికి శ్రీవారు చెప్పిన కాలజ్ఞానము ఆయన బహూకరించిన మనోనేత్రము. పండిత పామరులందరికీ అది అబ్బురమైన ప్రవచనము. వర్గవైషమ్యాలు, మత తారతమ్యాలు రాగద్వేషాలు లేని రాజయోగి శ్రీ వీరబ్రహ్మేంద్రుడు, కర్మ బద్దులై, వ్యామోహాలకు చిక్కి, పాపభూయిష్ఠమైన యాతనలకులోనై పరి తపిస్తున్న జ్రలను ఉద్ధరించేందుకు అవతరించిన మహానుభావుడు శ్రీ జేజినాయన, మహామహిమాన్వితుడైన ఈ అవతారమూర్తి యొక్క అమర గాధను వ్రాసే సదవకాశం నాకు కూడా కలిగింది. - పి.బి.వీరాచార్యులు |