అద్వైత ఋషి, కుల నిర్మూలనా విప్లవ ప్రవక్త ''శ్రీ నారాయణ గురు''

ఈ అద్వైత ఋషి అపూర్వ దార్శనికత గురించి, ఈ నిరుపమాన, కుల నిర్మూలనా విప్లవ ప్రవక్త మహత్తర కృషి గురించి కేరళ రాష్ట్రంలోనూ, కొద్దిగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ తప్ప, మొత్తం భారతదేశంలో - ఆ మాటకి వస్తే కనీసం మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకి పెద్దగా తెలియకపోవడం దురదృష్టం.

కుల అసమానతలతోనూ, మత ద్వేషకీలల తోనూ కుతకుతలాడుతున్న సమకాలీన భారతంలో - ఇప్పుడు నారాయణ గురువంటి సంస్కర్తల భావాలు, కృషి గురించి పల్లె పల్లెకూ తెలియాల్సిన అవసరం ఉంది.

నిమ్నవర్గాల ఆత్మవిశ్సాం, అభ్యున్నతి లక్ష్యంగా సాగుతున్న కులనిర్మూలన పోరాటంలో, విద్వేషాలని సంపూర్తిగా ఓడించడమే తక్షణ కర్తవ్యంగా సాగుతున్న మతోన్మాద వ్యతిరేక సమరంలో - నారాయణ గురు ఉద్యమం నేర్పుతున్న అనుభవాలు పాఠాలూ విలువైనవి.

పేజీలు : 198

Write a review

Note: HTML is not translated!
Bad           Good