నాలుగువందల ఏళ్ళ క్రితం కళింగప్రభువుల ఏలుబడిలో ఉన్న శ్రీకూర్మం, హర్షవిల్లి, శ్రీములఖలింగం దేవాలయాలకు మధురారాజు విజయరంగ చొక్కనాధుడు (1706-1776) పాడి ఆవులను దేవుని పూజలకై కానుకగా పంపించాడు. అతడు చాలా ఆలయాలను నిర్మించిన ఘన చరిత్ర కలిగినవాడు. మహాదైవభక్తిపరాయణుడు. ఆ ఆవులను దేవాలయాలకు అందజేసే బాధ్యత నాలుగు యాదవ కుటుంబాలకు అప్పగించారు. ఆవుల మందను తోలుకుని నాలుగు యాదవ కుటుంబీకులు బయల్దేరి. ఒక్కో దేవాలయంకు కొన్ని గోవులను సమర్పించి శ్రీముఖలింగంలో కొన్నాళ్ళుండాలనుకున్నారు. తొలుత శ్రీకూర్మ చేరుకున్నారు. అక్కడ పాడి ఆవులను ఆలయపూజారులకు అప్పగించి బయల్దేరారు. కానీ, వర్షాలు వారిని ముందుకు వెళ్ళనీయలేదు. మిగిలిన ఆవులమందను దేవాలయానికి ఆనుకుని ఉన్న తోటలో చెట్టుక్రింద కట్టేసి ఆలయానికి ఉత్తర దిశలోగల సత్రంలో తలదాచుకున్నారు. ఆలయ పూజారులు వారికి వండుకునేందుకు బియ్యం, పప్పులు ఇచ్చారు. అక్కడ ఒక యోగి వచ్చి విడిది చేసి ఉన్నాడు. అతడు పాడి ఆవులను చూసి ''ఏమయ్యా పశుపాలకులారా, మీ రాజు చొక్కనాధుడు క్షేమమే కదా, నేను ఆయన్ని ఎరుగుదును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good