శ్రీకృష్ణుడు భగవదంశంగా మన పురాణాలూ వాజ్మయం చెప్తున్నాయి. ఇది మన సాంప్రదాయాల్లో, మతపరమైన వేడుకల్లో, వ్యాఖ్యల్లో, భారతీయ జీవన విధానంలో ద్రుగ్గోచరమోతూనే ఉంది. అయితే ఆయన మానవరూపంలో కోపతాపాలలోను, ప్రేమభిమానాల్లోనుఒకనిగా కనిపించినప్పటికీ, మానవతీతమైనవి, మహిమాన్వితమైనవి ఘన కార్యములు చేసి చూపించిన పరమపురుషుడుగా, సోదాహరణంగా చెప్పడానికి వీలును కల్పించాడు. శ్రీ మురళిరావు గారు గీతోపదేశం గురించి ప్రస్తావిస్తూ అర్జునునికి కొద్ది వ్యవధిలో చీకటి నుండి వెలుగులోనికి తీసుకురాగలిగిన గీతా ప్రవచనం మనకు అందుబాటులో ఉండడం ఆవశ్యకము అన్నారు. నిజమే! ఆచరణకు అవాగాహనకు ప్రధమ గణ్యమైన భారత సంస్కృతి నిదానమైన భగవద్గీతను మనం ఎందుకో ఉపయోగించుకోలేకపోతున్నాం. శ్రీ కృష్ణ భగవానుని గీతా సందేశాన్ని మనము గ్రహించి ఆచరించాలేకపోతున్నామన్న సున్నితమైన విషయాన్ని సకృత్తుగా ప్రస్తావించి పాఠకులను ఆలోచనాపరులను చేశాడీయన. నిజమే దాన్ని సులభతరం, సుభగం చేయవలసిన అవసరముంది. అందులో మానవ సమస్యలకు, మానసిక రుగ్మతలకు చికిత్స ఉంది. జిజ్ఞాసువులు ఈ దిశగా ప్రయత్నపరులవ్వాలి...........ఇక అసలు శ్రీకృష్ణుడు వ్యక్తా? వ్యవస్థా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి మరి.........
-క్రోవి లక్ష్మీకాంత శాస్త్రి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good