వెయ్యిన్నొక్క పుస్తకాలు రాసిన కొవ్వలికి ఆధునిక సాహిత్యంలో తగిన స్థానం లేదు అని ఆమె తపిస్తున్నారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ఆమె ఆశయం నెరవేర్చడం కోసం అనేక విధాల పరిశోధించి కొవ్వలికి తిరిగి పూర్వ వైభవం రావాలని, ఆధునిక నవలా సాహిత్య లోకంలో ఆయనకు సముచిత స్థానం రావాలని ఆమె చేస్తున్న ఉద్యమానికి మా అభినందనలు. 

‘‘కొవ్వలి’’ ఎవరూ? అని అడిగేవాళ్ళకి సమాధానం యీ పుస్తకం. ఇరవై అయిదేళ్ళవయసుకే నాలుగు వందల నవలలు, 35 ఏళ్ళ వయసుకి 600 నవలలు, జీవిత కాలంలో మొత్తం 1001 నవలల్ని రాసిన మహా రచయితని, నవలా సాహిత్య సార్వభౌముడ్ని సమీక్షించాలంటే ‘ఎవరికి సాధ్యం?Ñ మత్స్యయంత్రం అర్జునుడు మాత్రమే కొట్టాడు. శివధనుస్సు రాముడు మాత్రమే విరిచాడు. కొవ్వలిని డా. సుశీలమ్మ మాత్రమే సమీక్షించింది, ఇటు జీవితాన్ని ` అటు జగజ్జాణ నవలని.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good