సృష్టిలోని ప్రాణులన్నీ, సంతానోత్పత్తిని చేస్తాయి. మానవులకూ, ఇతర ప్రాణులకూ ఈ అంశము నందు ఎట్టి భేదమూ లేదు. అనంతరమే వైవిధ్యము ఈ జీవులమధ్య నెలకొంటుంది. మిగిలిన ప్రాణులన్నీ తమ జీవితములను కేవలము ఆహార సముపార్జన, సంతానోత్పత్తి అనెడి ద్వివిధకార్యములకే పరిమితము చేసుకోగా, మానవుడు, తాను కూడా ఆ కార్యక్రమములను నిర్వహిస్తూనే, వాటికి అతీతమైనదీ, శాశ్వతమైనదేదో, కావాలని కోరుకుంటాడు. ఆవస్తువేదో అతనికి తెలియదు. కానీ పొందవలెనని ఆరాటపడుతుంటాడు. ఇటువంటి దశలో మనని ఆదుకొని, అక్కున చేర్చుకొని, మనకు కావలసిన వస్తువు యొక్క స్వరూప, స్వభావములను తెలుసుకొనగల జ్ఞానభిక్షను పెట్టి, ఆధ్యాత్మిక మార్గమును చూపించి నడిపించి తద్వారా భవసాగరమును తరింపజేసి, శాశ్వతానందభరితమైన మోక్షప్రాప్తిని కలుగజేయువారే గురువులు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good