"గురు" అనే శబ్దం ఎంత గొప్పదో, ఈ దేశంలో పుట్టిన, నాటివారందిరికి బాగా తెలుసు. నేటివారిలో కొందరికి తెలుసు.

"మాతృదేవోభవ, పితృదేవోభవ"ల సంస్కృతికి మసిపట్టి, "మమ్మీ - డాడీ"ల సంస్కృతికి చాలా మంది దగ్గర అవుతూంటే, ఇంకా ... ఏ కొద్దిమందో "అమ్మా - నాన్న" అంటున్నారు, అనిపించుకుంటున్నారు.

పాఠశాలల్లో, పంతులుగారు "మాతృదేవోభవ" అని చెప్పే సంస్కృతి, అనకూడదుకాని, అక్కడక్కడా, తాటాకు గొడుగుల్లాగా, కనబడుతుంది. మొదటి రెండు ... "మోక్షానికి" ముగింపు పలుకుతూంటే " ఆచార్యదేవోభవ" ఆమడ దూరంలోనున్న ఆంగ్ల పాఠశాలల నుండి, కనీసం, అరమైలు, కాదంటే ఆరుమైళ్ళ దూరంలో, కనుమరుగైపోయింది....

Write a review

Note: HTML is not translated!
Bad           Good