Rs.60.00
Out Of Stock
-
+
'శ్రీ ఛానెల్ - 2' పూర్తిగా హాస్య, వ్యంగ్య రచనల సమాహారం. ప్రపంచ నవ్వుల దినోత్సవం (4-5-2014) సాక్షి ఫన్ డే కోసం శ్రీరమణ రచించిన ''నవ్వులో శివుడున్నాడు''ను కూడా ఈ గ్రంథంలో చేర్చబడింది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది - మృష్టాన్న భోజనం తర్వాత తాంబూలంలా (ఇది శ్రీరమణ గారి ప్రయోగమే) 'విశ్వనాథ అంతరంగంలో శ్రీశ్రీ'. ఎవ్వరు ఔనన్నా ఎవ్వరు కాదన్నా 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యమంతా రెండు స్తంభాల చుట్టూ తిరిగింది (ఇప్పటికీ తిరుగుతూనే ఉంది). సాంప్రదాయక స్తంభం విశ్వనాథ సత్యనారాయణ గారైతే, అభ్యుదయ స్తంభం శ్రీశ్రీ. అలాంటి రెండు భిన్న వ్యక్తిత్వాలకు ఒకరిపై మరొకరికి ఎటువంఇ ఆదరాభిమానాలుండేవో తెలియజేసే వ్యాసం ఇది.
Pages : 154