నవగ్రహాలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఛాయాదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన శనీశ్వరుడు యమధర్మరాజుకి అన్నగా, జ్యేష్ఠాదేవికి భర్తగా నీలవర్ణంతో ప్రకాశిస్తూ వుంటాడు. సూర్యుడి తేజస్సుతో జన్మించిన శనిదేవుడికి, పరమేశ్వరుడు నవగ్రహాలలో 7వ స్థానాన్ని, మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వరంగా అనుగ్రహించాడు. అలాగే శనిదేవుడి దృష్టికి తిరుగులేకుండా ఆయన ప్రభావానికి దేవ, దానవ, మానవులలో ఎవరైనా గురికావలసిన స్థితిని ఆయనకు కల్పించాడు. శనిదేవుడిది కాశ్యపగోత్రం. ఆయనకు జ్యేష్ఠ, నీల, మంద అని ముగ్గురు భార్యలు. ఈయన కుమారుడి పేరు గుళికుడు. ఈయన వాహనం గ్రద్ధ / కాకి. శనిదేవుడికి అధిదేవత ప్రజాపతి కాగా, ప్రత్యధిదేవతగా యమధర్మరాజు ఉంటాడు. శనీశ్వర దోషనివృత్తి కోసం ఈ గ్రంథంలో చెప్పిన విధంగా వరుసగా 7 శనివారాలు స్వామివారిని షోడశోపచార పూజతో అర్చించి, సహస్రనామాది స్తోత్రాలను పఠిస్తే శనిగ్రహ దోషం సంపూర్ణంగా తొలగిపోతుంది.
Pages : 35