సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు.  మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి.

రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు.  పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు.

నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాకుతోచిన వివరణలు వ్రాశాను.  అవి నాకు తోచినవి మాత్రమే. అందరూ ఏకీభవించనక్కరలేదు.  అయితే ''ఆలోచనామృతము'' మీరు కూడా ఆలోచించడానికి ఉపకరిస్తే ధన్యుణ్ణి.

మహాభారత కథ మాత్రం చెప్పినవారు, విమర్శ మాత్రం చేసిన వారూ ఉన్నారు. కథ చెప్పి అక్కణ్ణే ''ఆలోచనామృతము'' కూర్చిన వాళ్లలో నేనే మొదటి వాణ్ణేమో!

మహాభారతం మనలో మనలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆహ్లాదం నింపుతుంది. ఆత్మోన్నతి కలిగిస్తుంది. మనసును పులకింప చేస్తుంది. కన్నుల నీరు నింపుతుంది. మహాజ్యోతిని ముందు నిలుపుతుంది. మనను పులకింప చేస్తుంది. పరవశింప చేస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good