అష్టాదశ పురాణాలలో వరాహపురాణం పన్నెండవది. 'వరాహం వామగుల్ఫకమ్‌' ఈ వరాహపురాణం శ్రీ మహావిష్ణువుకి ఎడమ చీలమండగా వర్ణించబడింది. 'చతుర్వింశతి సహస్రాణి తత్పురాణమిహోచ్యతే' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణంలో మొత్తం 24000 శ్లోకాలున్నాయి. 'విష్ణునాభిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే'' అన్న మాట ప్రకారం శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి భూదేవికి ఈ పురాణాన్ని చెప్పాడని తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ పురాణానికి వరాహపురాణం అనే పేరు వచ్చింది. ఈ దివ్యపురాణంలో మొత్తం 215 అధ్యాయాలున్నాయి. పురాణం మొత్తం అధ్యాయాలుగానే విభాగించబడింది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good