'కాళహస్తి మాహాత్మ్యము' శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుపుతూ రచించబడిన ప్రబంధ శైలిలోగల గ్రంథం. కాళహస్తి క్షేత్ర మహాత్మ్యం సంస్కృత స్కాందపురాణంలోని శివ రహస్య ఖండంలోని కథ. కొద్దిపాటి కథను స్వీకరించి శ్రీకాళహస్తీశ్వర మహిమను తెలిపే పురాణ ప్రసిద్ధాలైన కథలను స్వీకరించి వాటిని అన్నింటిని శివభక్తి అనే ఏక సూత్రంతో ఘటించి ధూర్జటి చక్కని శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని ప్రబంధశైలిలో రచించాడు. ఈ ప్రబంధము శ్రీకాళహస్తీశ్వరునికి అంకితం చేయబడింది.

ఇక ధూర్జటి రెండవ కృతి అయిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని శైలి ధారాళంగా భక్తి భరితమై ఒప్పుతూ ఉన్నది. ధూర్జటి పరమ శివభక్తుడు. శుద్ధ శైవుడు. ఒకానొక శివశతక కర్త అతని శివభక్తి మహిమను

చెలిచంటి విూద జేయిడి

చెలువొప్ప శివాయటన్న జేడియ నవ్వన్‌

జలపట్టి శివునిజూపిన

చెలువుని ధూర్జటిని దలతుజెన్నొంద శివా

అని ప్రస్తుతించాడు. దీనిని బట్టి ధూర్జటి అపార మహిమాన్వితుడైన శివభక్తుడని చెప్పవచ్చు.

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good