భగవాన్‌ వేదవ్యాసమహర్షి రచించిన పురాణాలలో ఎంతో విశేషమైనది దేవీ భాగవతం. ధర్మార్ధకామ మోక్షదాయకాలైన ఎన్నో కథలు, వృత్తాంతాలు ఈ పురాణంలో ఉన్నాయి. జగన్మాత దివ్యవైభవాన్ని, ఆమె సర్వవ్యాపకత్వాన్ని ఈ పురాణం తెలియచేస్తుంది. పన్నెండు స్కంధాలతో రచించబడ్డ ఈ పురాణమే అష్టాదశ మహాపురాణాలలో ఒకటని కొందరి అభిప్రాయం. అయితే శ్రీహరి దివ్యవైభవాన్ని వర్ణించే భాగవతమహాపురాణం ఎంత విశిష్టంగా అష్టాదశ పురాణాలలో గుర్తింపు పొందిందో, అదేవిధంగా దేవి దివ్య తత్త్వాన్ని ప్రబోధించే దేవీ భాగవతం కూడా స్వతంత్ర పురాణంగా అంతే ప్రాముఖ్యాన్ని పొందింది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good