క్షేత్ర క్షేత్రజ్ఞుల, భేదాన్నీ, భూతప్రకృతినించి మోక్షాన్నీ, జ్ఞాన నేత్రంతో ఎవరు తెలుసుకుంటున్నారో వారు వరాన్ని పొందుతున్నారు.
మామూలుగా చూసేవారికి క్షేత్రమూ కనపడదు. క్షేత్రజ్ఞుడూ కనపడడు. కనపడేదల్లా ఆ ఇద్దరూ కలిసిన దేహమే. ఈ దేహంలో క్షేత్రమూ, క్షేత్రజ్ఞులూ ఉన్నారు. జ్ఞాననేత్రంతో చూస్తే తప్ప వారికి భేదం తెలీదు.
మనిషి ప్రకృతి గుణాలకి వశ్యుడై చరిస్తున్నాడు. ఆ ప్రకృతి గుణాల అధికారం నించి తప్పించుకునే ఉపాయం ఒక్క జ్ఞాన నేత్రాలకే తెలుస్తుంది.
క్షేత్రమంటే దేహం.
క్షేత్రాలన్నిటినీ తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు.
క్షేత్రానికి తనని తానుగాని, ఇతరాన్ని గాని తెలుసుకునే శక్తిలేదు.
క్షేత్రజ్ఞుడే స్పృహ, తెలివి, చిత్.
తెలుసుకునేది వుంటేనేగాని తెలుసుకోబడేది లేదు.
తెలుసుకోబడేది వుంటేనేగాని తెలుసుకునేవాడు లేడు.
తెలుసుకునే క్షేత్రజ్ఞుడు వుంటేనే కాని క్షేత్రం లేదు.
తెలుసుకునేందుకు క్షేత్రం వుంటేనే గాని క్షేత్రజ్ఞుడు లేడు.
క్షేత్రాన్ని తెలుసుకోనప్పుడు క్షేత్రజ్ఞుడు తనని తాను తెలుసుకునే పరమాత్మ.
అసలు సత్యం మానసాతీతం.
పేజీలు: 280