భారతీయులకు ఆరాధ్యదైవమైన శ్రీరాముని సేవకుడిగా, విశ్వాసపాత్రునిగా, భక్తునిగా, జ్ఞానిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్న పురాణపురుషుడు ఆంజనేయుడు.
రాముడు మనకు శాంతమూర్తిగా, పిత్రువాక్యపాలకునిగా, సోదరప్రేమికునిగా, బార్యపట్ల అనురాగమూర్తిగా, ప్రజల రక్షణే ధ్యేయంగా నిలిచిన రాజుగా, భార్యావియోగ సమయంలో విరహబాధననుభవించే సాధారణ మానవుడిగా, యిలా ఎన్నో విధాలుగా మనకు గోచరిస్తాడు. అలానే హనుమంతుడు గూడా సేవకునిగా, భక్తునిగా, జ్ఞానిగా, దూతగా, పండితునిగా, కార్యనిర్వాహకునిగా, విశ్వాసపాత్రునిగా మనకు దర్శనమిస్తాడు. అందువలనే రామాయణంలో శ్రీరామునికి ఎంత ప్రాశస్త్యం వుందో హనుమాకు అంతే ప్రాధాన్యత వుంది.
హనుమంతుని రూపం చూసినా, స్మరించుకున్నా మనకు తెలియని ఏదో శక్తి మనలో చేరి ధైర్యం, చొరవ, ఉత్సాహం కలిగి కర్తవ్యనిర్వాహణకు ముందుకు నడిపిస్తాయి. అందుకనే నేడు గ్రామాలలో, కూడళ్ళలో ఆంజనేయుని విగ్రహాలు ప్రతిష్టించి, ఆ స్ఫూర్తిని పొందుతున్నారు.
పురాణ పురుషుడు ఆంజనేయునిపై ఎన్ని గ్రంథాలు వచ్చినా మరల గ్రంథకర్తలు కొత్తకొత్త విషయాలతో కొత్త గ్రంథాలు తెస్తూనే వున్నారు. అలానే ఈ గ్రంథకర్త శ్రీ పంతులు లక్ష్మీనారాయణ రావు గారు ఎన్నో పురాతన గ్రంథాలు శోధించి, తన అనుభవాలు జోడించి ఈ గ్రంథం వ్రాశారు. ఈ గ్రంథంలో అనేక కొత్త విషయాలు భక్తులకు వెల్లడించారు. ఈ గ్రంధం చదవండి - ఆంజనేయుని కొలిచి తరించండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good