'శ్రమకావ్యం' శ్రమను చిత్రించిన మహాకావ్యం. ఈ కావ్యంలో కాలముంది. అది సుదీర్ఘమయిన కాలం. కొన్ని యుగాల కాలం. స్థలం లేదు. స్థలమంటే ఫలానా ఊరు, ఫలానా రాష్ట్రం ఫలానా దేశం అని లేదు. ప్రపంచమంతా ఈ కావ్యంలో స్థలం భౌగోళిక సరిహద్దులు లేని స్థలం ఈ కావ్యానికి రంగస్థలం. ఈ కావ్యం లో శ్రమి, శ్రముడు అని రెండే రెండు పాత్రలు కనిపిస్తాయి. లెఖ్కకు రెండే కాని అవి సుదీర్ఘ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మనుగడసాగించిన అసంఖ్యాక జనసమూహాలకు ప్రతీకలు. ఆ జనసమూహౄల జీవితానుభవాల సారం, వాళ్ళ జీవన పోరాటం, వాళ్ళ సాహసాలు, సృజనాత్మక కృషిసారం, వాళ్ళ శ్రమ ఈ కావ్యంలో వస్తువు. అందువల్ల 'శ్రమకావ్యం' కేవలం దీర్ఘ కవితో సుదీర్ఘ కవితో కాదు. అనేక యుగాల సామాజిక పరిణామాల ప్రతిఫలనా గానం. ఈ కావ్యం ఆధునిక  మహాకావ్యం. శ్రమహాకావ్యం అనడం ఉచితం. ఈ కావ్యంలో ఐతిహాసిక లక్షణాలున్నాయి. ప్రకృతిలో మనిషి - అందులో విభిన్నానుభవాల సంపుటి. ఇదీ ఈ కావ్యంలోని ఇతిహాస లక్షణం. - రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి

Pages : 170

Write a review

Note: HTML is not translated!
Bad           Good