Buy Telugu Spiritual Books Online at Lowest Prices. Largest collection of Spiritual and Devotional Books in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Naimisam

ఒకప్పుడు భగవంతుని ఆజ్ఞానుసారం భూమిపై ప్రవేశించిన ధర్మ చక్రం వెనుక, శౌనక మహాముని నాయకత్వంలో ఎనభై ఎనిమిది వేల మంది నైష్ఠిక బ్రహ్మచారులు బయలుదేరారు.  ఆ చక్రం గంగనుదాటి గోమతీ భగవతీ నదీ తటంలోని ఒక ఘోరారణ్యానికి వెళ్ళి ఆగింది. ధర్మచక్రం యొక్క నేమి (చక్రం చుట్టూ వుండే కడ్డీ) వదులై, ఎక్కడైతే పడిపోయిందో..

Rs.63.00

Sri Rama Karnamrutam..

శ్రీరామకర్ణామృతము అనుపేరను ప్రసిద్ధమయిన యీ సంస్కృత గ్రంథము నెవ్వరెప్పుడు రచియించియున్నారో తెలిసికొనుటకు ఇందు ఆధారము లేదు. దీనిని నాలుగాశ్వాసములుగా విభజించి ప్రతిశ్లోకమునకు తెలుగున పద్యములు వ్రాసిన చేకూరి సిద్ధకవి ప్రతియాశ్వాసము చివర, ''శివసామ్యుండగు నాది శంకరులుమున్‌ శ్రీరామకర్ణామృతం, బవనిన్‌ సంస్కృ..

Rs.90.00

Sri Siva Puranam

      ఈ పుస్తకములో సృష్టి ఖండము, సతి ఖండము, పార్వతి ఖండము, కుమార ఖండము, యుద్ధ ఖండము, రుద్రా ఖండము,లిల ఖండము, లింగ వైభవ ఖండము, ఉమా ఖండము, కైలాస ఖండము, వాయు ఖండము, విద్వేశ్వర ఖండము,లింగ పురాణం, స్కంద పురాణం గురించి ఉన్నవి...

Rs.180.00

Asthadasa Puranamulu

 సాక్షాత్‌ నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుని విరచితాలైన ఈ అష్టాదశ పురాణాలు, మనకు యుగాల తరబడి అందుతూ వస్తున్న విజ్ఞాన సర్వస్వాలు, అమృత భాండాలు. సృష్టిలో ఎన్ని రీతులున్నాయో - ఎన్ని రమణీయ సన్నివేశాలున్నాయో అవన్నీ మన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. భారతీయ సంస్కృతికీ, తరతరాల ఇతిహాస ప్రవాహానికీ పెన్నిధిగా న..

Rs.180.00

Adhyatmika Geyamulu

ఇదొక పారమర్ధిక కవితా ఖండకావ్యం. భారతీయ సాంప్రదాయక వేదాంతానికి కవి హృదయానువాద కావ్యమిది. ''వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే'' కాళిదాసు శ్లోకంతో ఈ కావ్య శ్రీకారం జరిగింది. వాక్కు అర్ధం అర్ధనారీశ్వర స్వరూపం. ఒకటిలేక మరొకటిలేదు. 'శబ్దార్ధములే శివ పార్వతులు' అన్న కవి మాట సత్యం. ఈ కావ్యం 32 కవితల స..

Rs.20.00

Srimadbhagavatgeeta ..

ఇహపరాల విషయంలో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని అవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో వచ్చిన సమస్యలను అర్థముచేసుకొనడానికి పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకర..

Rs.203.00

Bhagavadgeeta Parama..

భగవద్గీత అనేది అనుభవ గ్రంథము. ఇది సాక్షాత్తు భగవంతుని ముఖము నుండి వెలుబడిన పలుకులు. ఇది ప్రజలనందరిని వారివారి సర్వస్వమును త్యజించి భగవంతుని పాదపద్మము శాశ్రయింపుండని బోధిస్తుంది. గీతలోని బోధనల ననుసరించినచో జీవితం ప్రశాంతంగా నడచి, మోక్షము సులభసాద్యమగును. ఇంతకీ గీత అంటే :- శ్రీకృష్ణ భగవానుని దూత, వేదవ..

Rs.135.00

Navaratna Phala Prak..

రత్నములు ధరించుట వలన కష్టములు తొలగి సుఖసంపదలు పొందుటచేతనే వేల సంవత్సరముల నుండి రత్నములు ధరించుట మనకు అలవాటుగా మారినది. ధరించే రత్నముల నాణ్యతను బట్టి ఫలితములుండును. ఈ పుస్తకంలో రత్నముల నాణ్యతలను గుర్తించే విధానము, ఏ రత్నము ఎవరు ధరించాలి అనే విషయములు సవిస్తారముగా రచయిత తెలియజేశారు.శమంతకమణి అనే పేరు వి..

Rs.108.00

Sundarakandamu

ఆదికవి అమరలేఖిని నుండి తప:ఫలంగా వెలువడిన రామాయణ గ్రంథం మన సంస్కృతికి మహత్తరనిధి కాగా సుందరకాండ నిత్యపారాయణ గ్రంథ రత్నమైనది. ఈ మహాకావ్యంలో శిరోమణి స్ధానాన్ని అలంకరించిన సుందరకాండ తత్త్వదృష్ట్యా, కవితా తత్త్వదృష్ట్యా కూడా విశేష స్ధానాన్ని అందుకుంది. ఈ కాండ పఠన, శ్రవణ, మననాదులను గురించి, బ్రహ్మాండ పురా..

Rs.230.00

Sanketika Vasthu Bha..

ప్రాచీన వాస్తుశాస్త్రంలో నిర్మాణానికి సంబంధించి వివరించిన సాంకేతిక విషయాలు, నియమాలు, నిబంధనలు ప్రస్తుతకాలంలోని ఇంజినీరింగ్‌ విషయాలకు, ప్రభుత్వ నియమాలకు సారుప్యత కనిపిస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించి ''వాస్తు నియమాలు అయినా ప్రభుత్వ నియమాలు అయినా వాటి ఉద్దేశ్యం మాత్రం ఒకటే. అది ధృఢమైన గాలి వెలుతురు..

Rs.135.00

Virata Parvam

      సంస్కృత మహాగ్రంధాల్లో, వాడుక భాషలో నేననువదిన్చాబునుకున్నవి మూడు. వాటిలో వాల్మీకి రామాయణం వొకటి. నే నది సుమారు పది సంవత్సరాల్ కిందట అనువదించాను. రెండోది యీ మహాభారతం. ఇది వ్యసప్తోక్తం. విరాట పర్వంతో ప్రరంబించానిది. రామాయానం మళ్ళి మళ్ళి చదివి క్షుణ్ణంగా బోధపరచుకున్న మని..

Rs.68.00

Oh My God

ధ్యానం అంటే ఏమిటి?  దానిని ఎలా చెయ్యాలి?  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నేర్పించే వివిధ ధ్యాన పద్ధతులు, వాటిని రూపొందించిన గురువుల వివరాలు, ధ్యానం చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదులో వారికి కలిగే అనుభవాలు మొదలైన వివరాఉ గల ఈ పుస్తకం ఆథ్యాత్మిక మార్గంలో వున్న వారికే కాక, సా..

Rs.108.00

Sridevee Bhagavatam

శ్రీదేవి, కరుణామయి, ఆదిశక్తి, మహామాయి, శ్రీ భువనేశ్వరి, అయిన ఆమె చల్లని చూపులు సదా ప్రసరింపజేసి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతగునట్లుగా మానవాళికి మంగళమగుగాకకు! జన్మనిచ్చి, శరీరాన్నిచ్చి, మాతృభావన దశ నుండి, అన్ని ప్రాణులకు ఆధారభూతురాలై శక్తినిచ్చే తల్లియైన ఆ జగన్మాత పాదాలవద్దకు చేర్చటానికి, సాధారణ దే..

Rs.90.00

Yagna Seni Drowpadi ..

సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి! అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించి..

Rs.311.00

Divyaanubhava Murthu..

ఈ సంపుటిలో 54 వ్యాసాలున్నాయి.  వ్యాసవస్తువేదైనా అందులో సామాజిక స్పర్శ, ఆధ్యాత్మిక చర్చ చేర్చడం లక్ష్మీప్రసాద్‌ రచనా విధాన వైశిష్ట్యం.  మహనీయులు, గురువు, ఆడంబరాలు, మనసు, సేవ, ఆధ్యాత్మికత - ఇలా వీటిలో ఎన్నో అంశాలపై ఆలోచనలు కలిగించే విషయాలను సుబోధం చేశారు.  ఎక్కడా కఠిన పారిభాషిక పదాలు లే..

Rs.45.00

Alokana - 2

ఆ భిక్షుకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు.  ''ఏంకావాలి?'' అనడిగాడు.  ''ఈ భిక్షాపాత్రను నింపండి'' అన్నాడు భిక్షుకుడు.  ''దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను'' అన్నాడు రాజు.  ''ఏవైనా ఫరవాలేదు, కానీ, అంచులదాకా నింపడం మరవకండి'' అన్నాడు భిక్షుకుడు.  రాజు తన ధనాగారం ను..

Rs.45.00

Alokana - 1

''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?''''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం.  శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. &nbs..

Rs.45.00

Ikkada Gnanamu Vikra..

    మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ ''రుచి'' అనే పదంలోనే వుంది. చక్కెరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేది అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తాను మాత్రం..

Rs.45.00

Neeyande Kaladoyi

    తల్లి తనకొడుకు గదిలోకి వెళ్ళింది. 'స్కూలుకు వెళ్ళాల్సిన టైమైంది కుమార్‌' అన్నది.     దుప్పటి ముసుగును తల మీదికి మరి కాస్త లాక్కున్నాడు కుమార్‌. 'నాకు స్కూలుకు వెళ్ళాలని లేదు'.     'వెళ్ళక తప్పదు' అన్నది తల్లి.     'నాకు వెళ్ళాలని లే..

Rs.45.00

Tirumala Visishtatha

 తిరుమల క్షేత్రంలోని ఏడుకొండలే వృషాద్రి. వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి. ఆత్మస్వరూపమైన పరమాత్మే ఏడుకొండలవిూది వేంకటేశ్వరుడు. నారములు అంటే జీవుల¬న్నింటికీ ఆధారభూతమైన స్వరూపమే నారాయణాద్రి విూద ఉండే వేంకటేశ్వరుడు. ఏడు చక్రములు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద..

Rs.32.00