వాస్తు శాస్త్రం గురించి నా అనుభవాలు ప్రత్యేకంగా చెప్పదలచాను. పండితులకు చెప్పవలసింది ఏమి లేదు. కానీ గృహస్ధుకు శాస్త్రం విషయం సవిరంగా తెలియకపోవడం వలన తెలుసుకునే అవకాశం లేకపోవడం వలన, శాస్త్రం మీద వున్న అనుమానాలతో అవసరం అయినపుడు సశాస్త్రీయమైనటువంటి మార్పు చెయ్యాలా, వద్దా? అనే సందిగ్ధంలో కాలయాపన చేసే అవసరం లేకుండా, వెసులుబాటు కోసం విశ్లేషణతో శాస్త్ర విషయాలు చెప్పడం ఈ రచన లక్ష్యం. ఈ రచన అందరినీ సంతృప్తి పరచలేకపోవచ్చు. కారణం ఇది సంస్కృతంలో వున్న శాస్త్ర శ్లోకాలకు మక్కీకి మక్కీ తెలుగు అనువాదం కాదు. దేశ కాలమాన పరిస్ధితులకు అనుకూలంగా 40 సంవత్సరాల నా ప్రత్యక్ష అనుభవంతో సామాన్య గృహస్తులు ఇనుప గుగ్గిళ్ళు అని భయపడి అర్ధం కాక సతమతం అయ్యే శాస్త్రాన్ని చప్పరిస్తే కరిగిపోయే విధంగా సులువుగా అర్ధం అయ్యే రీతిలో చెప్పి ఈ సమాజం ఋణం తీర్చుకోవాలనుకున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good