మనిషి సౌఖ్యవంతంగా జీవించడానికి, సుఖ సంతోషాలు మొదలయిన మంచి ఫలితాలు పొందటానికిగాను నివాస యోగ్యమయిన ఇంటిని ఏవిధంగా నిర్మించుకోవాలో తెలిపేది 'గృహవాస్తుశాస్త్రం'.

వాస్తు శాస్త్ర ఆవిర్భావం పురాణేతిహాస కాలంలోనే ఆవిర్భవించినట్లు నిర్ధారణగా తెలుస్తున్నది. అలా వాస్తు శాస్త్రం చాలా పురాతన శాస్త్రం. అయితే దానికి పురాణ ప్రాముఖ్యత ఎంత వున్నప్పటికీ 'సైంటిఫిక్‌ రీజనింగ్‌' ఉన్నట్లు ప్రస్తావన లేదు. ఉదాహరణకు 'ఇంటి గడపకు పసుపు రాయాలి? అన్న నియమాన్ని అందరూ ప్రాచీన కాలం నుండీ ఆచరిస్తూ వస్తున్నారు. అది ఒక నియమంగానే వుండిపోయింది. దానికి మేధావులు 'పసుపులో క్రిమినిరోధక శక్తి వుండే రసాయనాలున్నాయని, అలా గడపకు పసుపు రాయటం వలన క్రిములు ఆ గడపను దాటి లోపలకు రాజాలవని' విశ్లేషించి అదీ అసలు శాస్త్రీయ కారణం అన్నారు.

'వాస్తు భూమి' ఒకసారి చదివి ప్రక్కన పెట్టేసే పుస్తకం కాదు. ఎప్పటికీ పనికి వచ్చేదీ, భద్రంగా దాచుకోదగినదీనూ. 'ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదవకండి. విషయాన్ని అభ్యసిస్తూ నెమ్మదిగా రోజూ ఒక అరగంట చదవండి' అంటున్నారు. ముందుమాటలో రచయిత దంతూరి పండరినాథ్‌ గారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good